సిగ్గుల మొగ్గ -మా సీతమ్మ

సిగ్గుల మొగ్గయౌ సీతమ్మతల్లియె 
కళ్యాణ శోభతో కదలిరాగ
అందాలు చిందేటి యయోధ్య రామయ్య
దరహాస వదనుడై తరలిరాగ
ఆకాశమాయెగా హరివిల్లు పందిళ్ళు
పుడమియంతయుమారె విడిదియిల్లు
దశరథుండంతట దరహాస వదనుడై
పున్నెంపు మొలకయౌ పుత్రుజుచె
కౌసల్యమాతయే కళ్యాణ తిలకంబు 
తీరుగా నుదుటను తీర్చిదిద్దే
రాములోరి పెండ్లి రారండి జనులార
కనుల పండు వట్లు కాంచరండి
జన్మ ధన్యమగును జన్మంబు లేదింక
మాట యిచ్చినాను మరువ కండి
రచన. గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత