పరతత్త్వం పరమసత్యం

అంతరాంతరములాపరమాత్ముడేయుండ
అతడెక్కడనుచు నడుగనేల
మశకపిపీలకమత్కుణములలో
మాటుగా దాగున్న మాధవుండు
నాలోన నీలోన నడయాడు చున్నాడు
ఆత్మలో దర్శించు నమృత మయుని
ఇందులోనున్నాడండండులోలేడంచు
సందియంబుందంచు శంకలేల
అణువులో నున్నట్టి యఖిలాంతరాత్ముడు
బ్రహ్మాండ మంతట పరిగినాడు
ఈ.వె. జగతిగతిని తానుచాతుర్యమొప్పగా
సూత్రధారు నట్లు  నూక్ష్మగతిని
నాటకాన మనము నటులమైనామయ్య
ఎట్లు రక్తి గట్టుయేరికెరుక
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత