సత్సాంగత్యము
🌹🌹 *సుభాషితమ్* 🌹🌹
--------------------------------------------
*శ్లోకం*
సత్సఙ్గాద్భవతి హి సాధుతా ఖలానాం
సాధూనాం న హి ఖలసఙ్గమాత్ ఖలత్వమ్|
ఆమోదం కుసుమభవం మృదేవ ధత్తే
మృద్గంధం న హి కుసుమాని ధారయన్తి||
(సుభాషితరత్నావళి)
*తాత్పర్యం*
సజ్జనసాంగత్యం వల్ల నీచులకు సౌమ్యగుణం తప్పక అలవడుతుంది. కానీ నీచుల మధ్య మెలిగినప్పటికీ సజ్జనులకు నీచగుణాలు అలవడవు.
నేలరాలిన పూలసువాసన మట్టికి అంటుకుంటుంది. కానీ మట్టివాసన పూలకు అంటదు.
నీచుడైననేమి నీతివంతునిచేర
మంచి గుణములబ్బుమహినిసుమ్ము
సుమమువలన పుడమి సుమగంధమందును
నేలవాసనేల పూలకబ్బు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి