అర్థవంతమైన జీవితం
అర్థంబువలననేయర్థవంతమనుమాట
బ్రతుకు కే మాత్రమ్ము పనికిరాదు
పేరుప్రఖ్యాతుల బడిసినానేనంచు
భ్రమలోన బ్రదికిన బ్రదుకుయౌనె
విద్వాంసుడనినీవు విర్రవీగినంతనె
బ్రదుకంత యేమంత బ్రదుకయగును
ఊహలో నుండకనుర్వికిదిగవచ్చి
అసలైన బ్రదుకునెనందుకొన్న
సఫలమౌ బ్రదుకంత సార్థకంబగును
పరులమేలుకొరకు బ్రదికిన బ్రదుకంత
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి