ప్రాంతీయ తత్త్వము --,జాతీయ భావము

ప్రాంతీయ తత్త్వమే పరమార్థమైనచో
జాతీయభావమ్ము జబ్బుపడును
భరతమాతకపుడు బాధకలుగునుకాదె
జాగ్రత్త పడరండి జనులు మీరు
స్వాంతంత్ర్యసమరాన సర్వంబు నర్పించి
బానిసతనమంత బాపినారు
దేశభక్తవరుల దివ్యమౌ కేంద్రాన్ని
కల్లలు చేయగా కాలమొచ్ఛె
ఆ.వె.మాతృదేశభక్తి మమతాను రక్తితో
మసలవలయునయ్యమరువకండి
జనని జన్మభూమి స్వర్గంబు కన్నాను
ఘనముకాదె మనకు ఖఛ్చితమ్ము
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత