కాశికే వేళ్ళాము

కాశికే వెళ్ళాము గంగలో మునిగాము
గంధమేమెత్తాము  కాంక్ష తోడ
పూజలేచేశాము బూతులే పలికాము
కల్లలే పలికాము కాని పనికి
తిట్టాముతిమ్మాము తీరునే మరిచాము
ధర్మమే మరిచాముదారితప్పి
కూటాలుకట్టాము కుట్రలేచేశాము
చీచాలు యున్నాను సిగ్గునే మరిచాము
వేషాలు వేశాము వేనవేలు
ఆ.వె.ఎన్నిచేసినేమి యేమిమిగిలెనోయి
చివరె కిట్లెమిగిలె  చింత దప్ప
కల్లలాయెకలలు కలతమిగెలెనంచు
తలచుచుందురేమొ తప్పకుండ
(రచన:-విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత