భరతాంబ
భరతాంబవడిలోన పసిబిడ్డ నేనౌదు
జాతీయ భావాలు జవమునొసగ
దేవతానిలయమౌ దీపించు నెప్పుడు
రజితాద్రి శ్రేణియే రక్ష నొసంగి
కాశ్మీర రాష్ట్రము కనకంపుమకుటమై
అందాలు చిందించారు ననవరతము
సౌందర్యసదనమౌ సౌరాష్ట్ర మంతయు
భాగ్యాల నెలవుగా వాసికెక్కు
కాశికా విశ్వేసుకలిగున్నరాష్టాన
రామయ్యవెలసిన రాచనగరు
పాటలీపుత్రాన పద్మాక్షుడంతట
గయలోన వెలసెగా కరుణతోడ
రసపుత్రవీరులరమ్యమౌచరితమ్ము
రాణాప్రతాపుని రాష్ట్రమదియె
ఉజ్జయని క్షిప్రమ్మ నుగ్రంపుశివుడుండు
కాళిదాసునికథ ఘనతకనుము
వంగదేశచరిత వర్ణనాతీతఘనత
మాతృభక్తియుతము మహినిసుమ్ము
దారుమయత్వమునదాక్షిణ్యమూర్తియె
బాహుదాయాత్రతోభద్రమెసగ
రథయాత్రజరుపును రమ్యరీతి
చరితార్థమైనట్టి ఛత్రపతినికన్న
మహనీయరాష్ట్రము మనకు స్పూర్తి
కన్నడ కస్తూరి కమనీయ చరితము
సంగీతసాహిత్య సరసగోష్టి
పాల్కుర్కి సోమన్న బమ్మెర పోతన
తెలగాణ సీమలో తేనెలొలుకు
లేపాక్షి బసవయ్య లేములేలేకుండ
అన్నపూర్ణగజేసె యాంధ్రభూమి
వీరపాండ్యునిధీరవీరత్వగాధతో
తమిళదేశంబంత తనివిచెందె
ఆదిశంకరులంత యవతరించిననేల
మళయాల రాష్ట్రాన్ని మహిమపరచె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి