శేషాచల సోదరుడు
అగ్రజుండతడయ్య యనితర సాధ్యుండు
గొల్లపిన్నికుదురుకోహినూరు
శేషాచలండతడు శేముషీవిభవుండు
మాకున్న మాకన్న మంచి వాడు
వాగీశ్వరీదేవి వరపుత్రడతడయ్య
దరహాసవదనుండు ధర్మమూర్తి
భాషానురక్తితో భారతీమాతకు
అర్చనంబొనరించు నమృతమూర్తి
బాంధవ్య భావమ్ము మమతాను రక్తియే
సాకార మైనట్లు సంచరించు
వలెలాంబసేవను వ్రతదీక్ష తో చేసి
మార్గము చూపిన మార్గదర్శి
ఆ.వె.మంచిగుణములన్ని మానవాకృతిదాల్చి
నిలిచినట్లు తలుతు నేను యెపుడు
ఏగినాడునేడు యేకాదశితిథిని
పుణికి పుచ్చుకొన్న పుణ్యమట్లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి