సర్వజీవులందు సర్వేశ్వరుడు కలడు
సర్వజీవులయందు సర్వేశ్వరుండుట
ఎల్లరెరినయట్టి యెరుక కాదె
అతడులేకమనకుయస్తిత్వంబు
అణుమత్ర ముండుట యసలు లేదు
నీదుప్రాణమనిన నీకెట్లు తీపియె
ఇతరజీవులకట్లు యిష్ట మగుట
తెలసికొనినవాడెధీమంతుడుర్విలో
పూర్వకర్మ వలన పుడమిలో జన్మించి
ప్రారభ్దకర్మాన బ్రతుక నిండు
ఆ.వె.హింస మార్గ మొదలి హితముతో వర్తించు
బ్రతుకు వాని బ్రతుకె భాగ్య మయ్య
సాధ నంబు చేత సమదర్శ నంబును
అందిపుచ్చుకొనుటె యవసరమ్ము
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి