ఉపవాస భావన

ఉపవాస భావన నుదరపోషణకైన
అశనమే మేలన్న యర్థమగును
పాపరహితమైన పావన భక్తియే.
ఉపవాసమగునయ్య నుర్విపైన
పత్రపుష్పములతో పరమాత్ము పూజయే 
నుపవాసమాయెను నుర్విపైన
భగవంతు మ్రోలను భక్తితో ప్రార్థన
ఉపవాస భావనే నుచిత  మగును
ఆ.వే.జాగరంబు పేరజంజాట మైనట్టి
చలన చిత్రవీక్ష జరుపరాదు
శివునిపైన నీవు చిత్తంబు నిల్పగా
శివుని రాత్రి పేరు చెల్లు నింక
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత