నటరాజనర్తన

నటరాజ మూర్తివై నర్తించు శంకరా!
అయ్యప స్మారుని నణగ ద్రొక్క
కాలకూటమునంత కంఠాన దాచిన
నీకేమి యిదిలెక్క నిజము నిజము
భువనభయమునంత బాపగా నీవింక
తాండవంబాడగా తరుణ మిదియె
కారుణ్య మూర్తివికరుణార్ద్ర దృష్టితో
కాపాడు వలెనంచు కోరినారు
ఆ.వె. ఈశ్వరుండవీవు విశ్వంబు నీదేను
కాచి ప్రొచు నట్టి కార్య మిదియె
లోక రక్షచేయ లోకేశ్వరుండవు
మాకు నీవె దిక్కు మాటలేల
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
అపస్మారుడు=ఇతడొక రక్షకుడు
నటరాజ పాదము క్రింద అణచ బడిన అసురుడు.
అపస్మారము =ఒకరోగము
రోగమునకు సంకేతము అపస్మారుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత