ఏడుకొండల స్వామి
ఆపదలనెపుడు నాపగావత్తువు
జాలమేలతమకు జాలిలేదె!
జగతిజనులకెల్లజాడ్యమెదవెనంచు
దిగులుచెందిరిపుడు దీనవశత
ఏడుగడవునీవు యేడ్పుమాన్పగలవు
ఆదుకొనగరమ్మునార్త జనుల
వెన్నకన్నమృదువు వెంకన్న మనసెమొ
వేగమొత్తువనుచు వేడినారు
ఆ.వె.సప్త గిరులువంక సాపేక్ష దృష్టితో
నీవు వత్తు ననుచు నిలిచి రయ్య
జాలిచూప వయ్య జాలమేల
అమ్మరాక కొరకు నర్భకులట్లుగా
పరితపించి రయ్య భక్త జనులు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి