పరమేశ్వరుని కుటుంబము
వాసుకి సర్పంబు వరమాల యట్లుగా
భుజగభూషణుడన్న స్పూర్తి కలిగె
పాడిపంటల కీవు భాద్యుండవంచును
బసవన్న కధికార మప్పగీంచె
కఠినాత్ము దండింప కాలభైరవ స్వామి
శివునాజ్ఞ చేతను శిక్షచేయు
ఆరుమోములవేల్పు యమర సేనానియై
అసురసైన్యమునంత యణచి వేసె
విఘ్నేశు కరుణచే విఘ్నాలు నశియించి
విఘ్నాధి పత్యంబు విజయమందె
స్థితిని తలచి చూడ శివలింగ రూపంబు
భ్రమణ వేగముచేత భద్రకాళి
స్థితియుగతియు మనకు చైతన్య రూపమ్ము
బ్రహ్మ తత్వ మెరుగ భద్రమగును
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి