శివపరివారం

వాసుకీ సర్పంబు వరమాలయట్లుగా
ఫణిభూషణాఖ్యతో పరిగినావు
పాడిపంటలకీవు బాధ్యుడవంచును
బసవన్న కధికార మిచ్చినావు
కఠినాత్ము దండింప కాలభైరవస్వామి
శివునాజ్ఞాచేతను శిక్షసేయ
ఆరుమోములవేల్పునమరసేనానియై
అసురసైన్యమునంతయణచివేసె
విఘ్నేషు కరుణచే విఘ్నాలు నశియించి
విఘ్నాధి పత్యమే విజయమందె
ఆ.వె.స్థితిశక్తియంత శివలింగరూపమై
భ్రమణవేగమాయె భద్రకాళి
స్తితియుగతియుమనకు చైతన్యరూపంబు
బ్రహ్మతత్వమెరుగ  భధ్రపదము
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత