ప్రపంచనిద్రదినోత్సవం
నిదురతల్లివడిని నిశ్చింతతోనిద్ర
దేవుడిచ్చువరము దినముదినము
నిదురలేనినరుడు నిస్త్రాణతోనంత
క్రుంగిపోవునెపుడు కువలయాన
ఆదమరపునిద్రయవ్యక్తమౌహాయి
పవ్వళింపుసుఖము పండుగౌను
ఆరోగ్యమందించుహాయైన నిద్రంత
అలసట పోగొట్టు హాయి నొసగు
స్వప్నజగతికీవె సామ్రాట్టువైనట్లు
ఊరించు నిన్నంత నుచిత రీతి
రాజైన రైతైన రాజిల్లు నిద్రకు
వర్ణాలు వర్గాలు వసుధలేవు
ఆ.వె.
నిదుర తల్లి కాదె.నిరతంబు నోదార్చు
చింత లెల్ల బాపు చిట్టి తల్లి
నిదుర లేని బ్రతుకు నిష్టురతరమౌను
ఇంత మంచి తల్లి యిలను లేదు
(,రచన:-విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి