రమణులు

కౌపీన వంతుడే కడుభాగ్యవంతుడు
విభుదేంద్ర వంధ్యుడు విశ్వమయుడు
మకుటమ్ములేనట్టి మహనీయుమూర్తికి
ప్రభువైన విభుడైన పదములంటు
చేతిలో కర్రైన చైతన్య వంతమ్ము
రాజదండమేపాటి రాజ్యమేల
బండపై కూర్చున్న పరతత్త్వమాతడే
బ్రహ్మండమేలేటి బ్ర్రహ్మమయుడు
విజ్ఞానియైనట్టి యజ్జాన వంతుని
పరతత్వ బుధ్ధితో బాగుసేయు
సారమేయమైనను సమదృష్టితో చూచి
ముక్తినిచ్చినయట్టి యుక్తిపరుడు
అరుణాచలంబున యధ్భుతంబతడోయి
కారణజన్ముడు కరుణశీలి
నాస్తికుండైననుయాస్తిపరునిసేయు
ఆత్మబంధువతడు నాత్మమయుడు
నిరతంబునీలోననన్వేష మొనరించ
నీగుట్టు తెలియును నీకెయనును
ఆ.వె. జంతుజాల మంత జన్మాంతరంబుల
కర్మ ఫలము యిచట గడిప దలచి
ఆశ్రయించ వచ్చునంశంబు రమణుండు
మదిని తెల్సి నట్టి మహతుడతడు
(రచన:-విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత