దక్షవాటిక లోన త్రక్ష్తుడు

దక్షవాటికలోన దక్షుగర్వమడచిన
దాక్షిణ్య మూర్తియే రక్షకుండు
మాణిక్య మాతయే మమతానురాగాల
భక్తాళి నెల్లను బ్రోచు తల్లి
దక్షిణ కాశిగా ధరలోన నున్నట్టి
పుణ్యంపు రాశియే భువిని చూడ
సుముఖడైననుభక్తసులభుడైన
గజకర్ణుడెప్పుడు కాచి యుండు
అంబుజోదరులైన ననునిత్యమీరీతి
కొలిచియుందురు వారు కొరతలేక
ఆ.వే.సాంబశివుని తోటి సంబంధ మెప్పుడు
కలగియుండగాను కలనుగాంచి
జన్మ ధన్యమయ్యెజన్మంబు లేనట్టి
మోక్ష మొసగు మయ్య మోద మంది
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత