భీమవరాన సోమేశ్వరుండు
సోమేశ్వరుండంత భీమేశ్వరంబున
అన్నపూర్ణమ్మతో నవతరించె
శశిశేఖరుండంత సర్వశ్రేయస్సులిచ్చు
మూక్తిపథముజూపు మునులకెల్ల
ఇందుకళలతోడ యింపునుగూర్చగా
వెన్నెల వెదజల్లు వేయిరెట్లు
అన్నపూర్ణమ్మ తో నాహార మందించి
సకలజీవులనెల్ల సాకునతడు
ఆ.వే.నిండు మనసుతోడ నీలకంఠునిపూజ
నేరవేర్చు కోర్కె నిండుగా ను
అతని యిఛ్ఛ లేక యాకైన కదలదు
శివుని వారికింక చింత యేల
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి