ఓంకారమూర్తి
ఓంకార మూర్తివై వ్యోమకేశుండవై
చైతన్య మూర్తివై చెలగినావు
ఆనంద మూర్తియైనంబికా నాథుడై
ఆనంద తాండవం.బాడినావు
వామదేవుండవై వాసుదేవాత్మయై
పణిభూషణుండవై పరిగినావు
భస్మాంగ రాగివై భవరోగ వైద్యుడై
భక్తాళి నెల్లను బ్రోచినావు
ఆ.వే నీదు మహిమ.లెన్న నేనెంత వాడను
కరుణ జూప వయ్య గరళకంఠ
ఇహము పరము లొసగు యీశ్వరుండవునీవు
భద్ర మెసగవలయు వరములిచ్చి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి