శ్రీరామకౄష్ణపరమహంస
కన్నతల్లివలెనుకాళికామాతను
అర్చించి మాట్లాడు నర్చు కుండు
తానుచూచుటెకాదు తనవారికెల్లును
భగవంతు చూపించు భక్తుడతడు
బ్రహ్మానుసంధాన పరమామృతమునంత
గురువుగాతానంత గుర్తుచేసె
సరళమౌ కథలతో పరతత్త్వమంతయు
పందారమట్లగాపంచిపెట్టె
గురువుతగినయట్టిగొప్పనంశిష్యుండు
జీవసేవయగునుశివునిపూజనమంచు
చాటిచెప్పెననౌరజగతికంత
అధ్యాత్మవిద్యనుయవనిజనులకెల్ల
అరచేతియరటిలా యందజేసె
ఆ.వె.పరమహంసుడనెడిప్రఖ్యాతిచెందిన
రామకృష్ణుచరిత రమ్యబోధ
దారిచూపునుకాదె ధాత్రిజనులకెల్ల
విశ్వమయుడుతాను విదితయశుడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి