పౌర్ణమీ చంద్రోదయం
మేఘపటలినుంచిమెలమెల్లగాజారి
కువలయానందమ్ము కూర్మినొసగె
రాజునేనచుతన రాజ్యమిదియంచు
రాజసానయరుదెంచె రాత్రికాగ
సంద్రంబు తండ్రియైసానందమందుచు
కెరటాలు పైకెత్తి కౌగిలించె
తరిగినాననుచును తలదించడెప్పుడు
బింకమ్ము చూపడు పెరిగినపుడు
సుధలెల్ల కురిపించి సౌఖ్యంబు నొసగును
తాపంబు శమియింప తత్పరుడు
ఆ.వె.పాలకడలి పుట్టి పరమేశుశిరమెక్కి
కుముదబాంధవుండు కుశలమడుగు
జగతి జనుల కెల్ల జాబిల్లి చుట్టమ్ము
చందమామరీతి చనువుచూపు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి