గంగమ్మ పుత్రుండు

గంగమ్మ పుత్రుండు గంభీరహృదయుండు
పితృభక్తి కితడోయి పెద్దదిక్కు
తండ్రిమనసెరిగి త్యజియించె రాజ్యంబు
తృణ ప్రాయ మట్లుగా తృష్ణలేక
స్వచ్ఛంద మరణంబు జనకుచే  వరముగా
స్వీకరించిన యట్టి శ్రేష్టుడితడు
వెన్నుని నామాలు వేనోళ్ళ కీర్తించి
వివరించి మనకిచ్చి వెడలినాడు
దేవ వ్రతుడనుచు దేవతల్ కీర్తించు
శంతను పుత్రుండు శాంతనవుడు
ఆ.వె.ధర్మ పక్ష పాతి ధర్మంబుకొరకునై
అసువులొడ్డినట్టి యాత్మమయుడు
భారతేతి హాస భాగ్యవిధాతగా
మదిని నిల్పుకొన్న మంచివాడు
(,రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత