ఆదిత్యుడరుడెంచె
అంబరమణియైన యాదిత్యుడరుదెంచె
గగనమండలమంత గర్వపడగ
తెల్లబోయెనరునితెలివిలా ఫ్రాక్దిశ
కనుపట్టె మనకంత కనుల ముందు
ఏడుగుర్రాలతో యేతేరె రథమంత
ఒంటిచక్రమనుట వోటిమాట
కాటుక చీకటి గజగజా వణకుతూ
పరుగెత్తి పరుగెత్తి పారిపోయె
ఆ.వే అతడు లేక జగతి కస్తిత్వమేలేదు
అర్క డనెడి పేరుయాప్తుడితడు
వంద నమ్ము సేయ వరమిచ్చు
దేవుడు
చారు శీలు డనగ ఛాయపతియె
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)
ఏకచక్రరథము యేడురంగులతేరు
ఏడుగుఱ్ఱాలతో యేగునతడు
సారథ్యమంతయుసానూర మయమాయె
కశ్యప సూనుండు కరుణ శీలి
ఉదయాద్రి పైనుంచి నూత్సాహ శీలియై
పయనించి తాగ్రుంకు పశ్చిమాబ్ధి
ఆహార మందించు నారోగ్య మొనగూర్చు
మైత్రితో తానంత మమత జూపు
వందనమ్మ చేయ వరమిచ్చు వేవేగ
భాస్క రుండు తాను భావ మెరుగు
కర్మ సాక్షి యతడు కనుమూయడెపుడైన
అంతరంగ మందు నతడెకలడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి