అసదృశ్యమైన ఘనతలు
గాయత్రి కన్నను ఘనమైన మంత్రమ్ము
విశ్వాన లేదింక విభుదులార!
కాశికా పురమంత ఘనమైన క్షేత్రము
విశ్వాన లేదింక విభుధులార!
విశ్వేశు కన్నను విభుదేంద్ర వంద్యుండు
విశ్వాన లేడింక విభుధులార!
క్లేశాలు హరియింప కేశవుకన్నను
వేల్పులు లేరింక విభుదులార!
ఆ.వె.ఇంతకన్న నిజము యిలలోన లేదయ్య
శృతులు వాక్కులిట్లు స్మృతులు తెలిపె
ఆదిశంకరాదియాచార్యులెల్లరు
తేనెలొలుకునట్లు తెలిపినారు
(రచన:- విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి