ఇష్టకామేశ్వరీదేవి

ఇష్టమొసగుతల్లి యిడుములుడుపుతల్లి
కామేశ్వరీ దేవి కరుణచూపు
కఠినమైననడక కష్టమైననుయేమి
నడచివెళ్ళవలయు దడవకుండ
తపముసేసిననీకు తథ్యంబు సిధ్ధించు
యోగులీరీతిని  యోగ్యులైరి
శ్రీశైల మందున సిధ్ధించు సర్వంబు
మల్లన్న దేవర మసలెనచట
ఆ.వే.భ్రమలనెల్ల బాపి మాయతెరనుద్రుంచు
ఆది శక్తి వెలసె నచట కాదె
శిఖర దర్శ నంబె శ్రేయ మొసగ
భక్తి జనుల కిదియె ముక్తిసదనమాయె
కామ్య మొసగు నట్టి కల్ప వెల్లి
(రచన:--, విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత