కారుణ్య శీల-కరోనా
కారుణ్యశీలయా? కష్టమౌ కరొనాన
నిర్ణయించగలమె నిజముగాను
అధికులనుచుతానునభిమామందదు
బడుగులనుచుతాను వదలదసలు
నేతలైననువారిభ్రాతలైననుతాను
వాత్సల్యమెరుగని కుత్సి తమ్ము
అగ్రగణ్యులనంచు నాదరింపనితీరు
కడపేదలనిసుంత కరుణలేదు
భేతాళు రీతిగా భీష్మించి సాధించు
మందులే లేనట్టి మాయజబ్బు
ఆవె.ప్రాణ భయముతోడ ప్రాణవాయవనుచు
కలత కలుగ జేయు కల్మషుండు
మూతి మూయు ముసుగు ముఖ్యాతి ముఖ్యమై
జనుల క్షోభ పెట్టు జాడ్యమాయె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి