సప్తపదులు
సుముహూర్త సమయాన చూపులు కలువగా
అనురాగలతయంత అల్లుకొనియె
మాంగల్య బంధమ్ము మమతా
ను రాగాల
ఆత్మీయ బంధమై అల్లుకొనగ
అక్షతా రోపణ ఆనంద సాంద్రమై
అన్యోన్య బంధమై అల్లుకొనియె
సప్తపదులతోడి సన్మిత్ర బంధమై
కల్పలతికవోలె కాంక్షదీర్చు
తలపు పలుకు లందు ధర్మార్థ కామాల
నీదు మాట మీర నిక్కమనుచు
వరుడు మాటనొసెగె వధువుతో తానంత
ఆర్ష ధర్మ మిదియె అవనిలోన
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి