వృధ్ధ మల్లికార్జునా -మా మురిపాలమొక్కులు

ముసలిమల్లికార్జునామురిపాలమొక్కులు
ఆందుకోనీవింక యాదరాన
కొండకోనలదాటి కోటికోర్కులతోడ
వచ్చినామయ్యరో మేము యిపుడె
అడవుల్లో దాగున్న యభవండవీవయ్య
నీకన్న మాకింక యాప్తులెవరు
అమ్మ వైననునీవె యయ్యవయ్యనునీవె
అన్నవైనననీవె యాదరించు
చుట్టాల పక్కాల చోద్యాలు చూచాము
నీవింకతోడంచు నిలిచినాము
ఆ.వె.పాలధారలింకపదిలమ్ము గానిచ్చి
పంచధారలింక పంచియిమ్ము
మల్లె పూల పూజ మనసులో చేయగా
మరపురానియట్టి మనసునిమ్ము
(,రచన:--విద్వాన్ గొల్లాపిన్నినాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత