అనంతపురం జిల్లా ఘనఛరిత్ర

అయ్యనంతపురపు నత్యధ్భుతచరిత
వర్ణింప నేరీకి వశము యగునె
ముసలమ్మ త్యాగము ముసలమ్మ కథతోనే
మొదలెట్ట వలయును మోదమలర
కొనకొండ్ల కొండలో కొందకుందుగురువు
జైనులకెల్లను జ్యేష్టు దతడు
లేపాక్షి బసవయ్య లేచివచ్చినటుల
కనుపట్టు మనకంత కనుల పంట
విరుపణ్ణ కట్టించె వీరభద్రుని గుడి
విశ్వాన వెలిసిన వింత యదియె
వేలాడు కంబమ్ము వేయెళ్ళు వెతికినా
లేపాక్షి లోదప్ప లేనె లేదు
కళ్యాణ దుర్గాన కనులార కాంచగా
రామయ్య వెలసెను రమ్య గుణుడు
వజ్రాలు లభియించు వర్షాగమమునందు
వజ్రాలు పేరుతో వార్త కెక్క
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత