సుమంగళి చిత్రసమీక్షఇంత దరిద్రమైన అసంబద్ధమైన చిత్రరాజమొకటి యుండదు.కాలైజీ టెరేస్ పైనుంచి పడిన హీరో గారు మామూలుగా సకల కార్యాలు చేస్తాడుగానీ,సంసారానికి పనికిరాడని వైద్యశాస్త్రానికి అందని థీమ్ తో తీసారు నిర్మాతలు. ఇంతకన్నా అహేతుకమైన తర్కానికందని ఊహా ఎలాకలిగిందో అర్థం కాదు.పైగా ఆ డాక్టర్ పెద్దమనిషి అంత ముఖ్యమైన విషయాన్నీ సూచనగా కూడా ఆయువకునికి చెప్పక, ఆ భారమంతా భార్య వైపు వేస్తాడు.ఇంతకూ నడమువిరిగిన ఆ లెక్చరర్ గారికి సంసార సుఖంపై కోరిక వుందడం విచిత్రాలొ కెల్లా విచిత్రం.అక్కడినుంచి దాగుడు మూతలు,బోలేడు కన్నీళ్ళు,చన్నీటి స్నానాలు..చివరకురహస్యః తెలిసిన భర్త భార్యకు తెలియకుండా వివాహం నిశ్చయం చేయడం ,అది భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకోవడం ఇదంతా హిరోయిన్ కు కాదు అగ్ని పరీక్ష.ప్రేక్షకులకు కఠిన పరీక్ష. ఇంత అసరాగ్యపు,అవ్యశ్చిత్తపు చిత్రాన్ని ఆపాతమధురమనడం విచిత్రాల్లో కెల్లా విచిత్రం(సుమంగళి చిత్రం సమీక్ష)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత