పర్యావరణ పరిరక్షణ
మంజులమైనట్టి మనుజలోకంబును
మరుభూమిగా మార్చె మానవుడు
భూమియె మాదంచు బూకరించెనరుడు
సర్వజీవులనెల్ల సంహరించె
వికృతమౌరీతిగా వికటాట్ట హాసంబు
చేయగాజాలిన చెనటి వీడు
కడలినంతకాలుష్యభరితమ్ము
కావించి చెడగొట్టుకఠినుడితడు
కానలన్నియునేడు కాలుష్యభవనాలు
తరువులన్నియునేడు తరిగిపోయె
సహజవనురులన్ని సర్వంబు ధ్వంసమ్ము
నరకలోకమాయె నరుని బ్రతుకు
ఆ.వె.జాలిలేక నరుడు జలరాశినంతను
మురుగు కాల్వ చేసి మురిసి పోయె
భావితరపు బ్రతుకు భాస్మాసురునిపాలు
ఏమి మిగిలినింక యేడ్పుదక్క
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి