పరమేశ్వరుడు
చిరునవ్వుచిందించి చెలితోడ నాటాడు
అరమోడ్పు కన్నుల అందగాడు
నీలంపు మెడతోడ నీటైన సొగకాడు
ఎత్తైన యెద్దుపై యెక్కితిరుగు
మూడుకన్నులరేడు ముల్లోకములనేలు
భస్మంపు పూతయే భాగ్యమనను
మారేడు దళములే మారేడు మెచ్చుగా
ఉమ్మెత్త పూవులె నుచిత మనను
అభిషేక జలముతో ఆనంద మందగా
ఆర్క పుష్ప మంత అంద మొసగ
వెండికొండ పైన వేల్పులందరు కొల్వగా
తపసు లందరంత తరిలి నారు
నవరసంబులంత నయనోత్సవమ్మివ
నటన చేసె విశ్వ నర్తకుండు
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి