శ్రీపి.వి.నరసింహారావు

----------------------------------------
తెలుగువాడొకడంత తేకువతోతాను
ధీరత్వ మొప్పగా డిల్లి యేలె
అణగారియున్నట్టి యార్థిక స్థితినంత

చక్కబరచెనంతచతుర యుక్తి
మేరునగముబోలుమేటిమగడుతాను
ధీరవరుడు తాను దీర్ఘదర్శి
కార్యైక దక్షుడు కర్తవ్య నిష్టుండు
అడ్డంకు లెదిరించు నర్జునుండు
చాతుర్యమందున చాణుక్యుసరిజోడు
మౌననియుతినున్న మునినిబోలు
బహుభాష లెరిగున్న భారతీ రూపమ్ము
మృదుభాషి బిరుదున్న హృదయుడతడు
వేయిపడగలున్న వేల్పునే తానంత
ఇంటిపేరుగమార్చె యింపుగాను
నరసింహుడనుపేరు నవనీత హృదయంబు
మార్దవంబునకంత మారుపేరు
ఆ‌.పదవి కోరడతడు పట్టంబు కట్టిన
తెలుగుతేజమట్లు వెలుగుచుండు
మేలిమూత్యమతడు మేధావులందును
మొదటి వరుస నుండు మేటి మొగుడు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత