శ్రీరాజమాతంగి
రాజీవ నేత్రయౌ రాజమాతంగి
రత్నసింహాసనా లాలిత్య కాంతి
ఘనమైన నీలంపుకాంతితో చెలగి
కెంజాయవర్ణంపు వలువతో నొప్పి
ముంజేతిచిలుకతో ముచ్చటల్ వినుచు
మైరేయిపానంబు మైకంబుగూర్చ
వల్లకీ వాదనా విణ్ణాన మొప్ప
తల్లిరో దండాలు దయగలతల్లి
మామాత మాతంగి మహిమతో వెలుగా
అందుకోనీవమ్మ వందనాలు
ఆ.వె.చదవుసాములొసగిసత్కీర్తి నందించి
అమ్మ వోలె నీవు నాదుకొనగ
కువలయముననింకకోరతేమియుండును
నాగరాజు మాట నమ్ము మరింక
(రచన:-విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి