ఆమ్నాయపీఠాలు
సృష్య్టాది నుంచియు శృతిసిధ్ధమౌనట్టి
వేదోక్త ధర్మంబు విదిత పరచ
అవనికేతెంచిన యాదిశంకరుడంత
అద్వైత మార్గంబు నవనికొసగె
ఆమ్నాయ పీఠాలు యవనిజనులనెల్ల
ఆదుకొనునటుల నందజేసె
గోవర్ధనాఖ్యతో కోటికాంతులతోటి
ప్రాక్దిశలోతాను పాదుకొల్పె
పశ్చిమ దిశలోన పద్మపాదునకంత
ఆచార్య పీఠమ్ము నందజేసె
శృంగేరి పీఠమ్ము శృతిస్మృతులకెల్ల
ఆధారమౌరీతి యవనికోసగె
బదరికాశ్రమమందు బ్రహ్మాను సంధాన
మందింప నెలకొల్పె మఠమునొకటి
ఆ.వే.భక్త తతకి నిచ్చెభగవస్తవములను
భాష్యరచన చేసె ప్రాజ్గులకెల్లను
ఆదిశంకరులుకు నతడెసాటి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి