నరసింహస్వామి
దనుజ మర్దనచేసి ధర్మంబు రక్షింప
అవనికేతెంచిన నచ్యుతుండు
ప్రహ్లాదవరదుడై భక్తాళి రక్షింప
స్థంబాన వెలసిన స్వామియతడు
వైరభక్తియుతుడు వర్జనీయుడుకాడు
మన్నింప దలచిన మాధవుండు
కారణజన్ముడౌ కనకకశిపునకు
దర్శనంబొసగగా ధన్యుడాయె
సంధ్యవేళ లోన స్థంభాన వెలసిన
నారసింహుడెపుడు నరులబ్రోచు
వేద మూర్తి యతడు వేదాంత వేద్యుండు
భక్త జనుల బ్రోచు భధ్రమూర్తి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి