ఆత్మవిశ్వాసం
ఆత్మవిశ్వాసియే నవలీలగా నడ్డంకు
లన్నియు సులువుగా నధిగ మించు
కౌశల్య మున్నటి క్రమశిక్షణంబంత
కర్మయోగ మున్నచో కడను ముట్టు
ఏకాగ్ర చిత్తునకేదురేమోకలదు
సర్వమ్ము వశమౌను శంకలేదు
కాయక మున్నచో కైలాస శైలంబు
కరతలామలకపు కరణి మెరసి
ఆ.వే.పవన సుతుని గాధ ప్రత్యక్ష సాక్ష్యంబు
అనుస రింప వలయు నార్యులార!
శాస్త్ర వచన మందు శ్రధ్ధయుంచవలయు
గుర్తు పెట్టు కొమ్ము గురువు మాట
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి