ఉపాధ్యాయులు
శిల్పి చాతుర్యంబు శిల్పంబు లోనుండు
కవులకౌశలమంత కావ్యమందు
శాస్త్రవేత్తల కృషి సాధనములయందు
హాలికులకృషి ఫలములందు
చిత్రకారునికృషి చిత్రంబునందున
కనిపించు మనకంత కనుల ముందు
హంగునార్భాటముల్ నసలేమి లేకుండ
తరగతి గదిలోనే తపమువోలె
భావిభరతమంత భవ్యమౌరీతిగా
అధ్యాపకుండంత నందజేయు
అంతరిక్షమునుంచి యాటబొమ్మవరకు
(రచన:-,గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి