అనురాగ మూర్తులు
అనురాగమూర్తులౌ అమ్మనాన్నలెపుడు
మర్కటాలైనను మంచివారె
వారికౌగిళ్ళలో వాత్సల్యభావాన్ని
అనుభవించినయట్టి యర్భకుండు
చింతలే లేనట్టి చిన్నారి యెప్పుడు
పెట్టిపుట్టగతానుపుట్టనేమొ
కాట్లకుక్కులయట్లుకలహాలవారింట
పుట్టకున్ననుమేలుపుడమిపైన
ధనమున్న లేకున్న దండిగా ప్రేమున్న
ఆప్యాయమందించునాలుమగలు
ఆ.వె
పూరిగుడిసెనున్న పుణ్యాలపంటయె
అడవిలోన నున్న హాయిగొల్పు
ప్రగతిపథములోనపయనించ గలరోయి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి