నాగేంద్రహారుడు
నాగేంద్ర హారుండు నయనాభి రాముడై
భస్మాంగరాగుడై భయముదీర్చు
నిత్యుడై శుధ్ధుడై నిగమైక వైద్యుడై
ఆనంద తాండవంబాడు నర్తకుండు
మూడుకన్నులతోడ ముల్లోకములనేలు
వెండికొండల సామి వేదమయుడు
గరళకంఠుడతడు కరుణార్ద్ర చిత్తుండు
భక్తజనుల కొంగు పసిడి యతడు
అడగకున్న యిచ్చె నర్ధాంగ భాగంబు
భద్ర మొసగు నట్టి దివ్య మూర్తి
నీవె దిక్కు నాకు నిరతంబు నమ్మితి
కంటి రెప్ప వోలె కావ వలయు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి