గోకినంత సుఖము
గోకినంతసుఖము కోహినూరుదొరికినా
దొరకదోయి యిలను దొరకదసలు
పుండుపడిననేమి పులకించినట్లుండు
మరపురానిసుఖము మరలుగొనును
తిమ్మిరంతసుఖము తీరుతీరులనుండు
ఇంద్రుడెడురుపడ్డ యిష్టపడునె
మనసుచేగానిమ్ము మాటచేగానిమ్ము
వర్ణింపతరమౌనె వసుధలోన
అనుభవించినంత నానంద మందుటే
మాటపలుకులేని మౌనవృత్తి
తెలిసినటులనుండు తెలియరాకుండును
పరమసుఖపురీతి పరిడవిల్లు
(హాస్యరచనగా మన్నింప మనవి)
రచన౼౼౼౼గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి