ముక్తకాలూ
దయను వీడి నట్టి దయ్యంబు తానంత
వింతలెల్ల తాను.వీక్ష చేయ
అరగుదెంచు నచట నార్భాటమున్ జేయ
కౌతుకంబుతోడి కొంటె దనము
కండకావరాన కనులుమూతపడగ
కల్లనిజములేమి కనుల బడవు
జగతి యంత నేడు జాగృతంబాయెనే
వేదధర్మమొకటె వేద్యమనగ
జపము తపము లేక శాఠ్యంబు చూపించి
మంచివారినెపుడు మభ్యపరచు
దొంగగురువులెల్ల దోచుకొందురునిన్ను
మాయచేయువారి మర్మమెరగు
పాలు పోసి పెనుప పామేమి మారును
వృధ్ధి చెందునోయి విషము మరియు
మంచి మాటలాడ మరియింతకోపించు
మదమురేగినట్టి మత్సరుండు
బాలవాక్యమైన పాటించ దగునోయి
యుక్తి యుక్తమైన సూక్తిరీతి
వృధ్ధు డాడినట్టి బుధ్ధిలేనిపలకు
వినగరాదుమనము విషపురీతి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి