ఘంటశాల -భగవద్గీత

భగవద్గీతలో సంగీత మాధుర్యం వెతకడం మృగతృష్ణలో నీరు వెదకడం తో సమానం. సంగీతం వేరు శాస్త్రం వేరు.
శ్లోకాలను పద్యాలను చదవడంలో ఆర్ష సంప్రదాయ మెకటి కలదు.
",శీఘ్రి,గీతి, శిరః కంపి,యథాలిఖిత పాటకః
అనర్థ zజ్ఞ్నో అల్పకంఠశ్చ షడైతే పాఠకాధమః" అన్నది శాస్త్రం.
1.తొందరగా చదివేవాడు,
2. రాగాలుతీసి పాడేవాడు(పద్యనాటకాలలో లాగా)
3.పద్యాలు చదేవప్పుడు తలయూపేవాడు.(కచేరీల్లో తబలా వాయించే వాడిలా)
4.అక్షర దోషాలు గమనించ కుండా పుస్తకంలో వున్నది వున్నట్లు చదివేవాడు.
5. అర్థం గ్రహించకుండా వుట్టినే చదివేసేవాడు.
6.పీలగొంతుతో గానీ కీచు గొంతుతోగాను చదివేవాడు.
ఈ 6 గురిని పాఠకుల్లో అధమస్థాయికి చెందిన వారిగా పరిగణించాలి.
ఇక ఘంటశాల భగవద్గీత గానానికి సంబంధించి నా మాట మన్నించాలి.
శ్లోకాలను రాగవరుసలతో చదవడం ఒకదోషం ఒకటైతే ,  ముందు శ్లోకానికి తరువాతి శ్లోకానికి సంబంధం లేకపోవడం మరొకటి.
ఉదాహరణకు సాంఖ్య యోగంలో 
"సంగాత్ సంజాయతే కామః
కామాత్ క్రోధోభి జాయతే
క్రోధాత్ భవతి సమ్మోహః
సమ్మోహాత్ స్మృతి విభ్రమః
స్మృతి భ్రంస్యాత్ బుధ్ధినాశాయ
బుధ్ధినాశాత్ ప్రణశ్యతి"
అని శ్లోకాన్ని చెప్పిన తరువాత
"ఏషా బ్రాహ్మి స్థితి పార్థ 
నైనాం ప్రాప్య విముహ్యతి"
దీనినే బ్రాహ్మి స్థితిఅంటారు అని వ్యాఖ్యానం వినిపిస్తుంది.
సర్వ నాశనం బ్రాహ్మీ స్థితా?  అనే అపార్థం వస్తుంది.
ఇదంతా క్లుప్తీకరణ  వల్ల  అసమగ్ర సంకలనం వల్ల అపారమైన నష్టం .
కాని శ్రోతలు ఘంటశాల గానమాధుర్యంలో కొట్టుకు పోవడం వల్ల  వారికి  ఈ అనర్థ కల్పన తట్టదు.ఎవరైనా ఈ లోపాన్ని ఎత్తి చూపితే తిట్టి పోస్తారు.తిట్టి పోశారు కూడా
"గతాను గతికో లోకః
న లోకః పారమార్థికః" అని సర్దుకోవడం మహాదోషం .
ప్రస్థాన త్రయంలో ప్రముఖమైన భగవద్గీతకు మహాపచారము కదా! 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత