సూక్తులు

వ్యక్తి పూజ చేయ వ్యక్తిత్వ మడుగంటు
నీడవంటి బ్రతుకు నీకు దిక్కు
అనుకరించ బోకు నవలక్షణాలను
విధము చెడుకు నీవు వెర్రి తోడ

ద్రావిడ వాద మంత దారిద్ర్య వాదంబు
ధరణిలోన లేదు తలచి చూడ
విభజనంబుకొరకు విద్వేష వాదమ్ము
వ్యాప్తి చేసిరకట! వసుధలోన
దేవు డిచ్చి నట్టి దివ్యమౌ బహుమతి
మనుజ జన్మ యనుచు మరువ రాదు
నీదు చర్య లెల్ల నిక్కమౌ బహమతా
అనుచు తలచ వలయు యహర హమ్ము

గతము పైని చింత గరళమ్ము వంటిది
భవిత మీది చింత భ్రమల ముంచు
వర్తమాన మందు వర్ధిష్ణువగుదువు
నాగరాజు పలుకు నాణ్య మోయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత