సూక్తులు
పాలుకోరు పిల్లి బడితదెబ్బలపైని
దృష్టి నిలుప డకట సృష్టి లోన
ధనము కోరు నరుడు తానెంరగడటుల
బాధ లొచ్చు ననుచు భావియందు
మంచివారితోడ మైత్రిసేయవలయు
దుష్టజనుల పొందు దుఃఖమొసగు
రామచంద్రు మైత్రి తోడరాజ పదవి
అలవిభీషనుండు నందుకొనియె
ఖరము మోయుగాదె గ్రంధజాలంబును
దానికేమివచ్చె తత్త్వ బుధ్ధి
చదువులోని కిటుకు చదవలేని నరుడు
ఎంతచదువ వానికేమిఫలము
దేవు డిచ్చి నట్టి దివ్యమౌ బహుమతి
మనుజ జన్మ యనుచు మరువ రాదు
నీదు చర్య లెల్ల నిక్కమౌ బహమతా
అనుచు తలచ వలయు యహర హమ్ము
పాఠశాలలోన పాఠంబుచదువుగా
యరుగుదెంచెనేమొ నాత్మయెకటి
ఒజ్జలెల్ల లేక నోర్పుపట్టననచు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి