శ్రీమాత
శ్రీమాత దయచేత సిధ్ధించు సర్వంబు
శ్రీశైల మల్లన్న చింత బాపు
ఆనంద మందించు నభ్యుదయమిచ్చు
మోదంబుచేకూర్చి మోక్షమొసగు
భ్రమరాంబ మనలోన భ్రమలెల్ల బాపగా
పరమేశుడంతట భక్తినొసగు
కామేశ్వరీదేవి కామితార్థములంత
అరచేత నరటిలా నప్పగించు
ఆ.వే.౹౹పదము ననుసరించి పరమార్థ మున్నట్లు
అమ్మ వెనుక మనకు నయ్య యుండు
జనని మనకుతాను జన్మమొసగురీతి
దారిచూపు శివుడు తండ్రియట్లు
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి