సాలోక్య-సామీప్య-సారూప్య-సాయుజ్యాలు
నీవున్న లోకాన నిలిచినా మేలౌను
సాలోక్య ముక్తియె సంభవించు
నీచెంత నిరతంబం నిలిచినా మేలౌను
సామీప్య ముక్తియే సంఘటిల్లు
నీరూపు మదిలోన నిరతంబు నిలపినా
సారూప్య ముక్తియే సంభవించు
నీమూర్తిమదిలోన నిరతంబు నిలుపగా
సాయుజ్య ముక్తియే సంభవించు
ఆ.వే అన్యచింతమాని నచ్యుతు మూర్తిని
మదిని నిలుపు భక్తి మాకు నిమ్ము
నిన్ను నమ్మి నట్టి నీభక్తాళి కెపుడు
శ్రేయ మొసగు మయ్య శ్రీనివాస!
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
తిరుమల పతియండ తీరుగా నుండగా
మాకేమి కొరతోయి మహిని యింక
ఆపద మొక్కులు యాలస్య మేలేక
కరుణతో తీర్చేటి కల్పతరువు
వడ్డికాసులసామి వర్షించు వరములు
జాలమేలేనట్టి జాలిగుండె
కోనేటి రాయడే కొండంత యండగా
డండిగా నుండగా డడువ మింక
ఆ.వే.అమ్మ పాలలోని యమృతమంతయునింక
స్వామి చూపులోన చాలకలదు
క్షణములోన చూచి శాశ్వతా నందమ్ము
పొంద దలచు నట్టి ప్రజల మయ్య
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి