చదువులలోని మర్మము

అనంత శాస్త్రం బహువేదితవ్యం
అల్పశ్చకాలో  బహవశ్చవిఘ్నః
యత్ సారభూతం తదుపాసితవ్యం
హంసోయథా క్షీరమివాంబు మిశ్రం

విపులమైనవోయి విజ్ఞాన శాస్త్రాలు
చదవదగినవేవొ చాలకలవు
కాలమల్పమాయె కలవెన్నొ విఘ్నాలు
సారమొరుగు హంస సామ్యమొట్లు

తిండి తిప్పలొకటె తీర్చుసుఖమొకటె 
భయమునిద్రయెకటె బ్రతుకునందు
బుధ్ధిబలమువలన పురుషుండు ఘనుడయ్యె
నాగరాజు మాట నమ్ముమింక

నోరుమంచిదైన నూరుమంచిదనెడి
పలుకుమరువదగునె మంచిగాను
భాషమంచిదైన భాగ్యంబు గలుగును
పరుసదనపు మాటపలుకనేల

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత