వానర సైన్యం దండయాత్ర
వారధి నిర్మించె వానర సైన్యము
లంకానగరమింక లక్ష్య మాయె
రామదండుకదలె రావణాసురుకింక
కాళరాత్రియగుట ఖచ్చితంబు
ధర్మమే రాముడై ధర్మంబు రక్షింప
ధాత్రిజకొరకునై తాను వెడలె
గాంభీర్య జలధియౌ కోసలేంద్రుండంత
రావణ వధకునై రచన చేసె
ఆ.వే. ధీరు వరుడెయతడు మేరునగము బోలు
కరుణ చూప టందు కల్పవృక్షమతడె
రాము బోలు వాడు రాము డొకడె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి