విద్యార్థి దివసము

విద్యార్థి దినమంచు  వింతపోకడలేల
బాల్యమందుచదువు భార మాయె
అత్యాధునికవిద్య నాస్థిపరులవంతు
బడుగువారిచదువు బండ చదువు
వింతపేరులతోడ విద్యాలయముపెట్టి
ధనమార్జించుటె ధర్మమాయె
విత్తమార్జనయనె వికృతమౌ వృత్తికి
విద్యాదానమన్నట్టి వింత బిరుదు
ఆ.వే.చండశాసనాల చండామార్ఖులతీరు
దయను చూపనట్టి దనుజు రీతి
ఆట పాట లేక యలమటించుచదవు
వలదు కాక వలదు వలదు మనకు
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత